ఇద్దరు మిత్ర్రులు రోజు సముద్రపు ఒడ్డు పై
జాగింగ్ చేసేవారు.
ఒక మిత్రునికి చిన్న పని ఉండి,
ఆలస్యం అయింది.
అతను ఎప్పటిలానే
సముద్రపు వడ్డుకు వచ్చేసరికి,
ఎన్నో స్టార్ ఫిష్, నక్షత్ర చేపలు
గుట్ట్టలు గుట్టలు గ పడి ఉన్నాయి.
అవి నీటిలో తప్ప బ్రతుకవు.
ఒకొక్కటి తీసి తిరిగి సముద్రం లోకి
విసరటం మొదలు బెట్టాడు.
వచ్చే పోయే వాళ్ళు నవ్వుతున్నారు.
కొందరు నిలబడి చోద్యం చూస్తున్నారు.
ఇంకొకాయన నిలబడి
'నువ్వు పిచ్చి వాడిలా ఉన్నావు.
నీ ఒక్కడి వల్లా అయ్యే పనేనా ఇది. పిచ్చి పని'
అని నవ్వుతున్నాడు.
ఆలస్యం గ వచ్చిన మిత్రుడు
అది గమనించాడు.
తనుకూడా చేత్తో చేపలను విసురుతూ,
అంకుల్ అతనికి వినపడదు.
మీరు చెప్పినా వృధానే.
ఎందుకంటే అతను నమ్మిన మంచి పనిని,
తన శక్తి వరకు పూర్తిచేయ కుండా వదిలిపెట్టడు.
అతను నా మిత్రుడు అన్నాడు.
అతను ఒక గొప్ప సర్జను.
తాను సర్వీస్ చేసున్న పేషెంట్ కోలుకోవాలని
మాత్రమే ఆలోచిస్తాడు.
నూరు ఆపరేషన్లు చేసినపుడు ఒకటి రెండు
ఫెయిల్ అవ్వవచ్చు, కానీ ఆ రెంటిలో మనం
ఉంటామని అనుకోగలమా?
ఈ ఒడ్డు పై లక్షల్లో ఈ చేపలు ఉండవచ్చు.
మన శక్తీ సరిపోక పోవచ్చు.
కానీ ఇప్పుడు నేను పట్టుకుని విసురుతున్న
ఈ చేప భవిష్యత్తు మాత్రం మారబోతుంది.
మిగతా వాటి గురించి ఆలోచిస్తూ దీని భవిష్యత్తు
పాడుచేయలేము.
అలా వీరిద్దరూ విసురుతుండడంతో మరి కొందరు,
చేయ నారంభించారు.
క్షణాల్లో అవన్నీ ఖాళీ అయిపోయినవి.
కథ లో నీతి:
చేసే మంచి పని మీద నమ్మకం, శ్రద్ద ఉండాలి.
ఒకసారి నమ్మకం కుదిరితే ఆగకూడదు.
చెవిటి వారిలా మారిపోవాలి.
కేవలం టార్గెట్ పైనే దృష్టి ఉంచాలి.
ఎన్నో కామెంట్లు వస్తూనే ఉంటాయ్ .
అది వారి స్వభావం, అవగాహన మంచి చేసినా, చెడు చేసినా అవి వస్తూనే ఉంటాయి.
అవి మన టార్గెట్ ను, ప్రభావితం చేయకూడదు.
సక్సెస్ తరువాత వచ్చేవి ప్రశంసలు.
*All the Best to everyone for everything.*👍👍
Very nice 👌
ReplyDelete