Skip to main content

Posts

పండ్లబుట్ట కథ - కుటుంబ భాందవ్యాలు..!

అరటిపండును తొక్క తీసేసి తింటాం. సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం. సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు  లోపలి గింజలు కూడా వదిలేస్తాం. ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం. జామ పళ్ళని మొత్తం తినేస్తాం. ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం. ఒక్కోటి ఒక్కో రుచి.  తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.  అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.             అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.  కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు.  ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే... అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ...
Recent posts

TEMESGEN - Power of Positive Thinking

My mom told me her story that really got me thinking about the   power of words. My mom says the word "Temesgen" many times a day every single day since the time of her youth. Which means "Thank You God" in Amharic. When she finished doing some task she says Temesgen. When she finished cooking she says Temesgen. When she finish cleaning the house she says Temesgen. When she finish eating her lunch with her friend she says Temesgen. When she got her paycheck she says Temesgen. You get where I am going.   When she was in her late twenties she met an amazing man that is loving, kind, caring, that loves his family very much. She met my father. And they got married and they made two amazing children. Me and my Sister.   The man that she met, my father, believe it or not his name is, wait for it..., Temesgen Yimer.   Starting from the day she told me this story i always kept track of the words coming out of my mouth. I always try to speak out positive words an...

ఆనందం వెతుక్కుంటే దొరకదు

ఒక ఆఫీసులో వ్యక్తిత్వ వికాసానికి   సంబంధించిన సెమినార్‌ జరుగుతోంది. పాల్గొన్న యాభై మందికీ శిక్షకుడు (Trainer) తలా ఒక బెలూన్‌ ఇచ్చి దాని మీద వారి పేరు రాయమన్నాడు. అందరూ రాశాక తీసుకెళ్లి పక్కన ఖాళీగా ఉన్న ఓ గదిలో పెట్టి రమ్మన్నాడు. అలాగే పెట్టి వచ్చారు.తర్వాత మళ్లీ అందర్నీ ఎవరి బెలూన్‌ వాళ్లు ఐదే నిమిషాల్లో తెచ్చుకోవాలని చెప్పాడు. అందరూ ఒకర్ని తోసుకుంటూ ఒకరు గదిలోకి పరుగులు తీశారు. కిందామీదా పడ్డారు. అందరికీ దూరంగా తమ పేరున్న బెలూన్‌ కన్పించినట్టే కన్పిస్తోంది. అందరినీ తోసుకుని దగ్గరకెళ్లేసరికి మాయమైపోతోంది. ఐదు నిమిషాలైనా ఎవరి బెలూన్‌ వారికి దొరకలేదు. అప్పుడిక ఎవరికి దొరికిన బెలూన్‌ వారు తీసుకొచ్చి, దాని మీద ఎవరి పేరుంటే వారికి ఇవ్వమని చెప్పాడు శిక్షకుడు. ఏ గొడవా లేకుండా రెండే నిమిషాల్లో ఎవరి చేతికి వారి పేరున్న బెలూన్లు వచ్చేశాయి. అందరూ వాటిని పట్టుకుని నవ్వుతూ నిలబడ్డారు. అప్పుడు చెప్పాడు శిక్షకుడు : ఆనందం కూడా అంతే. మనకోసం మనం వెతుక్కుంటే దొరకదు.ఇతరులకు సహాయపడినప్పుడే మన ఆనందం మనకు దొరుకుతుంది... అని!

ఖాళీ గానే ఉంటావు కదా.! ఇల్లాలు గొప్పతనం

ఖాళీ గానే ఉంటావు కదా. ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు" జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాస...

నిజమైన ప్రేమ

ఒకతను ఒక అందమైన యువతిని ఇష్టపడి ప్రేమించి   పెళ్ళిచేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు. ఒక రోజు ఆమెకు చర్మంపై మచ్చలు రావడం గమనించింది. మెడిసిన్ వాడుతున్నా అవి తగ్గకపోవడంతో, బయటకు రాలేక కుమిలిపోతుండేది. ఇదిలా ఉండగా ఒకరోజు కాంప్ కు వెళ్ళిన తన భర్త కారు ప్రమాదానికి గురవ్వడం, తలకి బలమైన గాయమై చూపుకోల్పోవడం జరిగింది. దీనితో ఆ దంపతులకు పెద్ద కష్టమొచ్చినట్లైంది. అయినా ఇద్దరూ అలాగే జీవితం సాగిస్తున్నారు. అనందంగా, సంతోషంగా, ప్రేమగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఏ సమస్యనైనా దాటుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు అనుకోకుండా మెట్లు దిగుతుండగా జారి పడిపోయి భార్య చనిపోతుంది.  భర్త ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేసి ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళుతూండగా ఒక మిత్రుడు ఎదురై అడుగుతాడు.."ఇన్నాళ్ళూ భార్య సహకారంతో బ్రతికావు. ఇపుడీ గుడ్డితనంతో రోజులు ఎలా గడపగలవు?" అని.   దానికి భర్త తన నల్ల కళ్ళజోడు తీసేస్తూ ..."నేను గుడ్డివాడిని కాదు. తన చర్మరోగం, అందవికారం చూసి నేను బాధపడతాననీ, అసహ్యించుకుంటానేమోనని నా భార్య కుమిలిపోయేది. అందుకే తను బాధపడకూడదని నేనే గుడ్డితనం నటించ...

సత్యవ్రతుడు

  కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు."రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసర...

విమర్శించడం తేలిక సరి చెయ్యడం కష్టం

  ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తె cలుసుకోవాలి అనుకున్నాడు . నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు " నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది . దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా " ఇంటూలే " ఖాళీ లేదు . ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు . మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు . " నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ ల...