Skip to main content

Posts

సోమరి

  ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం   ఆలస్యం   అవడంతో   దారిలో   ఒక చీరలు   నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి   సేద తీరుతాడు   .వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి   మర్యాదలు   చేసారు.అలసిపోయిన   రాజు ఉదయం లేవడం   కాస్త ఆలస్యం   అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో   వారు ఉన్నారు .రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు   .అతడి   చేతికి ఒక తాడు   కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా   ఆ వ్యక్తి రాజు అడిగే   ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే   ఇవ్వడం మొదలు పెట్టాడు ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు   బాబు కదిలినప్పుడల్లా   ఈ తాడు లాగితే   బాబు నిదుర పోతాడు   అని చెప్పాడు .అతనికి దగ్గరలో   ఒక కట్టె కనిపించింది రాజుకి. అదేందుకు   అని అడిగాడు రాజు బయట నా భార్య ధాన్యాలను   ఎండబెట్టి   వెళ్ళింది పక్షులేవైనా   వస్తే   ఈ కట్టె కు కట్టిన   నల్లగుడ్డ   ఊపితే   అవి వెళ్లిపోతాయి   అని బదులిచ్చాడు   ఆ వ్యక్త...

వృద్ధాశ్రమంలో ఒకపూట

కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను..... " కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు 500 రూ. ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ. ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినాసరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే " నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు భోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి మాకు...

పట్టుధల ఎలా వుండలి.?

ఇద్దరు మిత్ర్రులు రోజు సముద్రపు ఒడ్డు పై  జాగింగ్ చేసేవారు.  ఒక మిత్రునికి చిన్న పని ఉండి,  ఆలస్యం అయింది.  అతను ఎప్పటిలానే సముద్రపు వడ్డుకు వచ్చేసరికి,  ఎన్నో స్టార్ ఫిష్, నక్షత్ర చేపలు  గుట్ట్టలు గుట్టలు గ పడి ఉన్నాయి.  అవి నీటిలో తప్ప బ్రతుకవు.  ఒకొక్కటి తీసి తిరిగి సముద్రం లోకి  విసరటం మొదలు బెట్టాడు.  వచ్చే పోయే వాళ్ళు నవ్వుతున్నారు.  కొందరు నిలబడి చోద్యం చూస్తున్నారు.  ఇంకొకాయన నిలబడి 'నువ్వు పిచ్చి వాడిలా ఉన్నావు. నీ ఒక్కడి వల్లా అయ్యే పనేనా ఇది. పిచ్చి పని'  అని నవ్వుతున్నాడు.  ఆలస్యం గ వచ్చిన మిత్రుడు  అది గమనించాడు.  తనుకూడా చేత్తో చేపలను విసురుతూ,  అంకుల్ అతనికి వినపడదు.  మీరు చెప్పినా వృధానే.  ఎందుకంటే అతను నమ్మిన మంచి పనిని,  తన శక్తి వరకు పూర్తిచేయ కుండా వదిలిపెట్టడు.  అతను నా మిత్రుడు అన్నాడు.  అతను ఒక గొప్ప సర్జను.  తాను సర్వీస్ చేసున్న పేషెంట్ కోలుకోవాలని  మాత్రమే ఆలోచిస్తాడు.  నూరు ఆపరేషన్లు చేసినపుడు ఒకటి రెండు  ఫెయిల్ అవ్వవచ్చు, కానీ ఆ రెం...

కోతి మొసలి కథ

  అనగనగా ఒక అడవిలో ఒక కోతి , ఒక మొసలి స్నేహితులు . నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా ? అది ఎవరికి తెలీదు . ఎలాగో పరిచయం అయ్యింది . కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది . ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు . నదిలో మొసలి ఇల్లు . రోజు కోతి చెట్టు మీద , మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి . ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి . కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి . మొసలి మాంసం తింటుంది , ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది , అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి . కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది . అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది . ఒక రోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది . ” ఏంటిది , నిజామా ? నీకు ఒక కోతి తో స్నేహముందా ?” అని ఒక రోజు మొసలిని అడిగింది . మొసలి ఒప్పుకుంటూ , “ అవును , చాలా రోజులు గా పరిచయం ఉంది . కోతి చాలా తెలివైనది , నాకు చాలా విషయాలు చెప్తుంది ” అన్నాడు . మొసలి భార్య , “ కోతి గుండె చాలా...